కాకినాడలో కమలంతో పొత్తుకు తూట్లు…. గెలుపు కోసం బరిలో టీడీపీ రెబల్స్
కాకినాడలో కాలం కలిసి రావడం లేదు. దీంతో అధికారపార్టీ కొత్త ప్లాన్లు వేస్తోంది. కమలంతో పొత్తు అంటూ వారికితొమ్మిది సీట్లు ఇచ్చారు. అయితే ఆ తొమ్మిది సీట్లల్లో టీడీపీ నేతలు రెబల్స్‌గా బరిలో ఉన్నారు. ఆ స్థానాల్లో టీడీపీ జెండాలు పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. పొత్తుకు తూట్లు పొడుస్తున్నారంటే… కమలం క్యాండేట్ బలంగా లేదని వింత వాదనలు తెరపైకి తెస్తున్నారు. మరోవైపు తమ పార్టీ అభ్యర్థులు బలంగా లేని చోట కూడా రెబల్స్‌ను బరిలోకి దించారు టీడీపీ నేతలు. అధికారికంగా గెలిస్తే ఓకే…. లేకపోతే మన రెబెలే గెలిచాడని లెక్కలో వేసుకోవాలని కుయుక్తులు పన్నుతున్నారు. పది డివిజన్లలో టీడీపీ రెబల్స్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.
మరోవైపు బీజేపీ పోటీ చేస్తున్న 9 స్థానాల్లో రెబల్స్‌ను టీడీపీ నేతలే పెట్టారు. వారికి పూర్తి అండదండలు ఇస్తున్నారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఈ డివిజన్లలో టీడీపీ తరపున ప్రచారం చేశారు. తన వెంట బీజేపీ నేతలు రావాలని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ విచిత్రాలు చూసి కాకినాడ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గెలుపు కోసం టీడీపీ నీచ రాజకీయాలకు కూడా పాల్పడుతోందని విమర్శిస్తున్నారు.








