కాకికాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార పర్వం
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార పర్వం నేటితో ముగియనుంది. ఆఖరి రోజు ప్రచారంలో టిడిపి నుంచి సీఎం చంద్రబాబు సహా పాల్గొంటుండగా, వైసిపి అధ్యక్షుడు జగన్ ప్రచారం నిర్వహించనున్నారు. టిడిపి హయాంలో కాకినాడను అభివృద్ధి చేసి చూపిస్తామని, కాపులకు న్యాయం చేస్తాం…బీసీలకు అన్యాయం చేయబోమని చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తుండగా, వైసిపి హయాంలోనే కాకినాడ అభివృద్ధి సాధ్యమని, అధికార పక్షంమీద విమర్శలు చేస్తూ జగన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. మిగతా పార్టీలు మినహా ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండటంతో కాకినాడ ఎన్నికల పర్వం వేడెక్కింది.








