ఆక్వా రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రుల ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్
ప్రెస్ కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…
• PMMKSSY పథకాన్ని ఏపీలో అమలు చేస్తాం… విశాఖ ఫిషింగ్ హార్బర్లో సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం…
• ఏడాది 30 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసేలా కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
• కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యంలో 30 శాతం ఏపీ వాటా ఉంటుందని హామీ ఇస్తున్నాం.
• సర్కులర్ ఎకానమీకి ఆక్వా రంగాన్ని అనుసంధానం చేసేలా భీమవరంలో ప్రాజెక్టులకు కేంద్రం సహకారం.
• మార్కెట్ ఇబ్బందులతో మద్దతు ధర కోల్పోయిన వివిధ పంటల రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాం.
• ప్రపంచవ్యాప్తంగా భారత దేశానికి గౌరవం దక్కడానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీనే.
• చాలా దేశాల్లో చాలా ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి… దేశాన్ని ప్రధాని సమర్థవంతంగా నడిపిస్తున్నారు.
• ఇవాళ నేను సైకిల్ తొక్కాను… పొదుపు చర్యలను ప్రోత్సహిస్తున్నాం.
• సూర్య ఘర్, పీఎం కుసుమ్ వంటి వాటిని కేంద్రం ప్రోత్సహిస్తోంది.
• అమెరికాలో నాలుగు పవర్ గ్రిడ్లు ఉన్నాయి… కానీ భారత దేశంలో ఒకే సెంట్రల్ పవర్ గ్రిడ్ ఉంది.
• భారత దేశంలో ఏ మారుమూల విద్యుత్ ఉత్పత్తి చేసినా… కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ 2014 తర్వాతే జరిగాయి.
• గతంలో సోలార్ విద్యుత్ యూనిట్‌కు రూ.14గా ఉండేది.. ఇప్పుడు యూనిట్‌కు రూ.2.40కు తగ్గింది.
• గతంలో సోలార్ ప్యానెళ్లను దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది.. కానీ ప్రధాని మోదీ నిర్ణయాలతో ఇప్పుడు ఏపీలో సోలార్ ప్యానెళ్లు ఉత్పత్తి చేసుకుంటున్నాం.








