రాబోయే ఐటీ కంపెనీలు విశాఖలోనే
రాబోయే ఐటీ కంపెనీలను విశాఖపట్నంలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి హెచ్సీఎల్తో పాటు మరో రెండు, మూడు ఐటీ కంపెనీలు రాష్ట్రానికి రానున్నాయని చెప్పారు. దీంతో మొత్తం 15వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. విశాఖలో ఐటీ ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారని రాబోయే ఐటీ కంపెనీలను అక్కడే ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. హెచ్సీఎల్ కంపెనీ అధినేత శివనాడార్తో సమావేశమైనప్పుడు ఆ కంపెనీలో దాదాపు 30శాతం మంది ఉద్యోగులు తెలుగువారేనని చెప్పారని తెలిపారు.








