పిఎస్ఎల్వి-సి 38 ప్రయోగం విజయవంతం
పిఎస్ఎల్వి-సి 38 ప్రయోగం విజయవంతం కావటంపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 14 దేశాలకు చెందిన 31 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇస్రో మరోసారి తన సత్తాను ప్రపంచానికి చాటిందన్నారు. ఇస్రో సాధిస్తున్న విజయాన్ని చూసి యావత్ భారతదేశం గర్విస్తుందన్నారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న ప్రతి ఒక్క శాస్త్రవేత్తకు ఆయన అభినందనలు తెలిపారు. ఉపగ్రహ ప్రయోగాలకు ఇస్రో ప్రపంచానికి మార్గదర్శిగా నిలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.








