త్వరలో అంతర్జాతీయ సదస్సు : చంద్రబాబు
సౌర, పవన విద్యుత్ నిల్వ విధానంలో సాంకేతిక పద్ధతులపై త్వరలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించే యోచన ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర రాజధాని నగర నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. సౌర, పవన విద్యుత్ నిల్వ విదానంలో మరింత అధ్యయనం కోసం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నిపుణుడు ప్రొఫెసర్ అశోక్ ఝున్ ఝున్ వాలాను సంప్రదించాలని ఇంధన కార్యదర్శి అజయ్జైన్ను సీఎం ఆదేశించారు.








