ద్వారకా తిరుమలలో… అంతర్జాతీయ ధార్మిక సమ్మేళనం
గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ ఆర్ట్ యూఎస్ఏ, అసోసియేషన్ ఆఫ్ పౌండేషన్ ఆఫ్ హిందూ రిలీజియన్ అండ్ ఛారిటబుల్ ఇనిస్టిట్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జూన్ 24, 25 తేదీలలో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారాక తిరుమలలో అంతర్జాతీయ హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఆ సంస్థ సాంస్కృతిక రాయబారి డా.గజల్ శ్రీనివాస్ ఒక ప్రకనటలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి హాజరవుతారన్నారు. సమ్మేళనంలో పాల్గొనదలిచిన వారు ఫోన్ నంబరు 9912626256లో సంప్రదించాలని ఆయన సూచించారు.













