తిరుపతిలో స్వాతంత్య్ర దినోత్సవం!
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈసారి తిరుపతిలో నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ వేడుకల ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఈ నెల 26న అన్ని శాఖాధిపతులు, ముఖ్య కార్యదర్శలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం పాఠం కోసం శాఖలవారీగా సమాచారం సేకరణ వంటి వివిధ అంశాలపై సీఎస్ అధికారులతో చర్చించనున్నారని సచివాలయంలో ఒక ఉన్నతాధికారి తెలిపారు.








