విశాఖలో ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్
ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్‌ను సెప్టెంబరులో విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో వల్లీకుమారి తెలిపారు. ఇందులో సుమారు 30 దేశాల ప్రతినిధులు పాల్గొంటారని ఆమె చెప్పారు. విశాఖలో ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. విశాఖలో ప్రపంచస్థాయి ఇంక్యుబేషన్ సెంటర్‌ని నెలకొల్పడం లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.








