హైకోర్టులో వైఎస్ జగన్ కు చుక్కెదురు
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. విజయవాడలోని నందిగామ పోలీస్స్టేషన్లో తనపై నమోదైన కేసునఱు కొట్టేయాలని హైకోర్టులో జగన్ క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటీషన్ను పరిశీలించిన కోర్టు, జగన్కు షాకిస్తూ ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద సమయంలో అధికారులతో జగన్ దురుసుగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జగన్తో మాటలు పడ్డ అధికారులు నందిగామ పీఎస్లో ఫిర్యాదు చేశారు. డ్యూటోలో ఉన్న అధికారులు ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లు జగన్ తిట్టారని వాళ్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు విషయమై జగన్ హైకోర్టులో క్యాష్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది.








