తిరుపతిలో హెలీటూరిజం
రాష్ట్ర పర్యటకశాఖ మ్యాక్ ఏవియేషన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం తిరుపతిలో శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మూెత్సవాల సమయానికి హెలీ టూరిజం అందుబాటులోకి రానుంది. 6 సీట్ల హెలీకాప్టర్ ద్వారా యాత్రికులకు తిరుపతి సమీప ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది. తిరుపతి బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం వసతి సముదాయం వెనుక ఉన్న ప్రైవేటు స్థలాన్ని అధికారులు హెలిప్యాడ్ కోసం పరిశీలించారు. మూడెకరాల ఈ స్థలాన్ని చదును చేసి, తాత్కాలిక హెలిప్యాడ్, బుకింగ్ కౌంటర్‌తో పాటు చుట్టూ కంచె నిర్మించనున్నారు. పోలీసు, రెవెన్యూ శాఖల అనుమతులు పొందిన పర్యటక శాఖ, హెలీటూరిజం ప్రాజెక్టు అనుమతి ఫైలును పౌర విమానయాన శాఖకు పంపింది. వారు కూడా సానుకూలంగా ఉండటంతో బ్రహ్మూెత్సవాల నాటికి సాకారం కావొచ్చని తెలుస్తోంది.








