ఆగస్టు రెండో వారంలో విస్తారంగా వానలు
జులై 21 నుంచి 31 వరకు రాష్ట్రంలో 15 మి.మీ. వర్షపాతం నమోదైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు షార్ అధికారులు వివరించారు. రుతుపవనాలు బలహీనపడి వారం రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికి ఆగస్టు రెండోవారంలో రాష్ట్రమంతటా మళ్లీ వానలు కురుస్తాయని చెప్పారు. అటు ఆల్మట్టి ప్రాజెక్టుకు నిరంతరాయంగా ఇన్ఫ్లో వుండటంతో 99% నిండిందని, నారాయణపూర్ ప్రాజెక్టు 97% నిండిందని, ఈ వారంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నీరు చేరుతుందని అంచనా వేస్తునట్టు తెలిపారు. అనంతపురంలోని 17 వర్షాభావ మండలాల్లో నీటి నిర్వహణకు తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. కర్నూలుకు తాగు నీటి సరఫరా అంశపైనా చర్చించారు. తుంగభద్ర, సుంకేశుల నుంచి తక్షణం నీటి సరఫరా చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.








