హనుమంత వాహనంపై తిరుమలేశుడు
తిరుమలలో శ్రీవారి హనుమంత వాహన సేవ వైభవంగా ప్రారంభమైంది. ఈ సేవ ఉదయం 11 గంటకు వరకు జరుగుతుంది. హనుమంతుడు శ్రీరామునికి సేవలందించిన తీరును ప్రస్ఫుటించేలా ఈ సేవ జరుగుతోంది. గోవింద నామస్మరణలతో సప్తగిరులు మార్మోగుతున్నాయి. తిరువీధులు భక్తజనసంద్రాన్ని తలపిస్తున్నాయి. నేటి సాయంత్రం స్వర్ణ రథోత్సవం, ఆ తర్వాత గజవాహన సేవలు జరగనున్నాయి.








