జీవిఎంసి ఎన్నికల నగారా..!
కోర్టు ఆదేశాల మేరకు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. దీంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రేటర్ విశాఖ ఎన్నికల నగారా కూడా మోగే సమయం ఆసన్నం కాబోతోంది. ఇటీవలి గ్రేటర్ విశాఖ పరిధిలో 82 వార్డులుగా విభజిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో గ్రేటర్ విశాఖలో అనకాపల్లి పురపాలక సంఘంతోపాటు మండలంలోని కొప్పాక, రాజుపాలెం, పరవాడ మండలంలోని సాలాపువానిపాలెం, తాడి గ్రామాలు సైతం విలీనమయ్యాయి. అలాగే భీమునిపట్నం మున్సిపాల్టీ కూడా విలీనమయింది. 2013 జూలై 30న ఈ ప్రక్రియ జరిగింది. జీవిఎంసికి ఎన్నికలు జరపకపోవడంతో అనకాపల్లి పట్టణం విలీన గ్రామాల్లో జవాబుదారీతనం కొరవడింది. 50వేల జనాభాకు ఒక వార్డుగా నిర్ణయించనున్నట్లు తెలిసింది. ఆ ప్రకారం అనకాపల్లి పట్టణంలో 84వేలు, విలీన గ్రామాల్లో 16వేల జనాభా ఉంది. వెరసి లక్ష జనాభా ఉన్నందున రెండు వార్డులు ఏర్పాటు కానున్నాయి.








