శ్రీవారి భక్తుల కోసం గోవింద్ యాప్ ఆవిష్కరణ
ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సేవలు మరింత చేరువయ్యేందుకు ‘గోవింద తిరుమల తిరుపతి దేవస్థానమ్స్’ యాప్‌ను టీటీడీ ఆవిష్కరించింది. ఉగాది పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట ఈవో సాంబశివరావు యాప్‌ను ప్రారంభించారు. టీసీఎస్ సహకారంతో రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా భక్తులకు వేగంగా, సులభంగా, ఎక్కడి నుంచైనా సేవలను పొందే అవకాశం వచ్చింది. ప్రస్తుతానికి ఈ-హుండీ, ఈ-డొనేషన్, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అద్దె గదుల నమోదు సదుపాయాలు ఈ యాప్ ద్వారా కల్పించాం. దశలవారీగా టీటీడీ సేవలన్నింటినీ ఈ యాప్‌లో పొందుపర్చుతాం. ప్రజలు గూగుల్ స్టోర్, టీటీడీ వెబ్సైట్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీటీడీ వెబ్‌సైట్‌కు 33 లక్షల మంది యూజర్లు ఉన్నారు. వీరందరూ కొత్త యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని అని ఈవో సాంబశివరావు తెలిపారు.













