పీవీ సింధుకు గవర్నర్, సీఎం అభినందనలు
కొరియా బ్యాడ్మింటన్ ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన పీవీ సింధుకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అభినందనలు తెలిపారు. సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. హరోహోరిగా సాగిన మ్యాచ్లో బలమైన ప్రత్యర్థిని మట్టికరిపించి టైటిట్ గెలవడం అభినందనీయమమని చంద్రబాబు అన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించి ఆంధ్రప్రదేశ్, భారత ఖ్యాతిని ఇనుమడింపజేయాలన్నారు.








