పోర్టుసిటీగా కాకినాడ : గోరంట్ల
కాకినాడను పోర్టుసిటీగా అభివృద్ధిపర్చేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సిని ప్రకటించామని చెప్పారు. కన్సల్టెంట్ స్కేల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రూ.12,500 కనీస వేతనం ఇస్తున్నామన్నారు. రాబోయే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ మేయర్ పీఠం కైవసం చేసుకోవడం ఖాయమని చెప్పారు.








