అమరావతిలో జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్
ఏపీ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం చేసుకున్న అంతర్జాతీయ ఫార్మాసుటికల్, బయోటెక్ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూర్ ఏఐ సంస్థలు
• ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న అస్ట్రాజెనెకా ఇండియా
• అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ విధానం ప్రారంభించేందుకు వీలుగా కీలకమైన అవగాహనా ఒప్పందం
• ఊపిరితిత్తులు, రొమ్ము కాన్సర్ రోగుల కోసం అధునాతన జన్యు పరీక్షలు బయోమార్కర్ టెస్టింగ్ చేసేందుకు వీలుగా ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయనున్న ఆస్ట్రాజెనెకా
• ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకురావటమే ఒప్పందం లక్ష్యమని పేర్కొన్న సీఎం చంద్రబాబు
• ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో క్వాంటం పరిశోధనలు జరగాల్సి ఉందని సూచించిన ముఖ్యమంత్రి








