ఆయనతో భోగి తర్వాత మరో సినిమా?
శర్వానంద్(Sharwanand) ఈ ఇయర్ తన సినిమాలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన హీరోగా నిలిచాడు. నారి నారి నడుమ మురారి(Nari nari naduma murari) సక్సెస్ తో పాటు బైకర్(biker) సినిమాలో ఆయన చూపించిన కొత్త లుక్, యాక్టింగ్ ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాయి. ప్రస్తుతం సంపత్ నంది(sampath nandi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోగి(Bhogi) సినిమాపై కూడా ఇండస్ట్రీలో మంచి అంచనాలున్నాయి. పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో శర్వానంద్ పాత్రతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. షూటింగ్ చివరి దశకు చేరుకుంటుండగా, సినిమా బజ్ రోజురోజుకూ పెరుగుతోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రఫ్ కట్‌ను చూసిన శర్వానంద్, డైరెక్టర్ సంపత్ నంది పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కథను తెరపై చూపించిన తీరు, యాక్షన్ ట్రీట్మెంట్ ఆయనను ఆకట్టుకున్నాయని టాక్ వినిపిస్తోంది. ఈ నమ్మకంతోనే భోగి రిలీజ్ తర్వాత మరోసారి సంపత్ నందితో సినిమా చేయడానికి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ సాగుతోంది. ఇద్దరి తర్వాతి కమిట్మెంట్లు పూర్తైన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై అధికారికంగా ముందడుగు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, కేకే రాధామోహన్(KK Radhamohan) నిర్మిస్తున్న భోగి సినిమాలో అనుపమ పరమేశ్వరన్(Anupama parameswaran), డింపుల్ హయాతి(Dimple Hayathi) హీరోయిన్ లుగా నటిస్తున్నారు. మొదట ఈ సినిమాను ఆగస్టు 28న రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ పూర్తయ్యాక కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. సరైన టైమ్ లో రిలీజ్ చేసి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. దీంతో భోగి కొత్త రిలీజ్ డేట్ పై ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.








