శ్రీనివాస మంగాపురంకు కలిసొచ్చే రన్‌టైమ్!
జయకృష్ణ ఘట్టమనేని(jaya krishna ghattamaneni) హీరోగా, రషా తదానీ(rasha tadhani) హీరోయిన్గా నటించిన శ్రీనివాస మంగాపురం(Srinivasa mangapuram) సినిమాపై ఆడియన్స్ లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. అజయ్ భూపతి(Ajay bhupathi) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అశ్వినీదత్(Ashwini dutt) సమర్పిస్తుండగా, జూలై 30న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే చిత్రబృందం తెలుగు రాష్ట్రాల్లో వరుస ప్రమోషన్లతో సినిమాపై మంచి బజ్‌ను తీసుకువచ్చింది. ముఖ్యంగా రిలీజైన టీజర్, ట్రైలర్‌తో పాటు జీవీ ప్రకాష్ కుమార్ ట్యూన్ చేసిన సాంగ్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుని సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
సూపర్ స్టార్ కృష్ణ(Krishna) మనవడిగా, మహేష్ బాబు(Mahesh babu) అన్న కొడుకుగా జయకృష్ణపై సహజంగానే ప్రత్యేక దృష్టి నెలకొంది. అయితే ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ లో జయకృష్ణ యాక్టింగ్, యాక్షన్ సీన్స్, డ్యాన్స్‌లు, ముఖ్యంగా ఎమోషన్స్ ను పలికించిన తీరు మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న జయకృష్ణకు ఈ సినిమా కీలకంగా మారనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. రషా తదానీతో ఆయన కెమిస్ట్రీ కూడా సినిమాకు మరో ఎట్రాక్షన్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమాకు 2 గంటల 35 నిమిషాల నిడివిని ఫైనల్ చేసినట్లు సమాచారం. కమర్షియల్ అంశాలతో పాటు స్ట్రాంగ్ లవ్ స్టోరీని సమతూకంగా చూపించేలా డైరెక్టర్ అజయ్ భూపతి కథను రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. ఎక్కడా అనవసరంగా సాగదీయకుండా ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఇచ్చే విధంగా సినిమాను మలిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెలకొన్న అంచనాలు, మాన్సూన్ సీజన్లో ఉన్న అనుకూల వాతావరణం దృష్ట్యా ఈ ప్రేమకథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.








