ది ప్యారడైజ్‌లో కీర్తి స్పెషల్ సాంగ్..
నేచురల్ స్టార్ నాని(nani) నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్(The paradise) పై ఆడియన్స్ లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh)ను సంప్రదించినట్లు, ఆమె పేరును చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
నాని, కీర్తి సురేష్ కాంబినేషన్‌కు ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన దసరా(dasara) సినిమా మంచి సక్సెస్ ను అందుకోవడంతో ఈ కాంబినేషన్‌పై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ స్పెషల్ సాంగ్ కోసం పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించినట్లు, అందులో కీర్తి సురేష్ పేరు ముందంజలో ఉందని సినీ వర్గాల సమాచారం. గతంలో పూజా హెగ్డే పేరు కూడా వినిపించినప్పటికీ, ప్రస్తుతం కీర్తి సురేష్ వైపే డిస్కషన్స్ సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ను నిర్మిస్తున్నారని, త్వరలోనే షూటింగ్ జరపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంకా రెండు పాటలు, కొన్ని కీలకమైన టాకీ సీన్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాను సుధాకర్ చెరుకూరి(Sudhakar cherukuri) నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాయదు లోహర్(Kayadhu lohar) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా నాని కెరీర్లో మరో విభిన్నమైన ప్రయత్నంగా నిలవనుంది.








