వైభవంగా గరుడ వాహన సేవ
తిరుమలలో గరుడవాహన సేవ వైభవంగా సాగింది. గరుడ పంచమి సందర్భంగా ప్రత్యేకంగా ఈ సేవ నిర్వహించారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవలో పూజలందుకున్న మలయప్ప స్వామివారు వాహన మండపంలో వేంచేపు చేశారు. స్వర్ణ, వజ్రాభరణాలు, సుగంధ పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలకరించారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ రాత్రి 7:00 గంటలకు గరడ వాహన సేవ ఆరంభించారు. ఆలయ మాడ వీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.








