ఈ నెల 28న తిరుమలలో గరుడవాహన సేవ
సాధారణంగా ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన తిరుమలలో శ్రీవారికి గరుడవాహనసేవ జరుగుతుంది. ఈ నెల 28న గరుడపంచమి రావడంతో పంచమి తిధిలో గరుడ పంచమికి ప్రత్యేకత ఉంది. జగద్విఖ్యాతిగాంచిన కలియుగవైకుంఠవాసుడు నెలకొన్న తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి గరుత్మంతుడు అత్యంత ప్రీతిపాత్రుడు. తన వాహనాల్లో గరుడునికి ప్రాధాన్యత ఉంది. గరుడపంచమిని పురస్కరించుకుని 28వ తేదీ తిరుమలలో గురుడ్మంతునికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.








