శాసనమండలి చైర్మన్‌గా ఫరూఖ్
శాసనమండలి చైర్మన్‌గా కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫరూఖ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌లో సెంటర్ ఫర్ లీడర్‌షీప్ ఎక్స్‌లెన్స్ పేరిట జరుగుతున్న సమావేశంలో ఫరూఖ్ పేరును చంద్రబాబు ప్రకటించారు. సహచర సభ్యులంతా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షదాన్యాలు తెలిపారు.








