అమరావతిలో భద్రత కట్టుదిట్టం
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పిలుపు మేరకు సచివాలయానికి వచ్చే మార్గాలన్నింటిలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే కరకట్ట మార్గంలో తెలిసిన వాహనాలు తప్ప ఇతర వాహనాలను అనుమతించడం లేదు. సచివాలయానికి వచ్చే మార్గంలోనూ వివరాలు తెలుసుకుని మాత్రమే వాహనాలు అనుమతిస్తున్నారు.








