వైఎస్ జగన్‌ను కలిసిన మంత్రి ఈటల
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ కలిశారు. తన కుమారుడు నితిన్ వివాహానికి తప్పక రావాలని ఈ సందర్భంగా ఈటల జగన్మోహన్రెడ్డిని ఆహ్వానించారు. కాగాచ ఈటెల కుమారుడు నితిన్ పెళ్లి జూన్ 18న హైదరాబాద్ నగరంలోని హైటెక్స్‌లో జరగనుంది. ఇప్పటికే మంత్రి ఈటల తన కొడుకు వివాహానికి రావాలని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే.








