నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జులై 29న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు ఆగస్టు 5ను చివరి తేదీగా ప్రకటించారు. ఆగస్టు 7న నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఆగస్టు 9 తుది గడువు. ఆగస్టు 23న పోలింగ్, 28న కౌంటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. ఎన్నికల కోడ్ నేటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించడంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి, వైకాపా తరపున శిల్పా మోహన్‌రెడ్డి పోటీ చేయనున్నారు.








