పౌర సేవలు అందించడంలో దేశానికే ఏపీ ఆదర్శం : చంద్రబాబు
పౌర సేవలు అందించడంలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ-ప్రగతిపై అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. 2017ను ఈ-ప్రగతి సంవత్సరంగా ప్రకటించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ డిజిటల్ ఏపీ కోసం క్లౌడ్ను వినియోగిస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని అన్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పేరిట మరో సాంకేతిక విప్లవం నడుస్తోందని, దాన్ని అందిపుచ్చుకోవడంలో ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు అందునుగుణంగా మార్చాలిన అవసరాన్ని గుర్తు చేశారు ఐటీని సామాన్యుల్లోకి తీసుకెళ్లి ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలమని అన్నారు. టెక్నాలజీ వినియోగంతో డబ్బులు ఖర్చు అనే వాదన సరికాదని తెలిపారు. టెక్నాలజీతో డబ్బును ఎక్కువ ఆదా అవుతుందని అన్నారు. మెరుగైన పనితీరు చూపించడానికి టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పారు. అంతా బాగుంటే మీడియాకు రాయడానికి ఏమీ ఉండదని ఆయన అన్నారు. నెగిటిల్ ఉంటే చూస్తారని వారి ఆలోచన అని అన్నారు. ఈ మధ్య కొన్ని తప్పుడు కథనాలు వేస్తున్నారని తెలిపారు.








