దసరా ఉత్సవాలకు గవర్నర్కు ఆహ్వానం
రానున్న దసరామహోత్సవాలకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా గవర్నర్ నరసింహన్ను విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గగుడి ఇవో ఎసూర్యకుమారి ఆహ్వానించారు. 21వ తేదీ నుండి అమ్మవారి సన్నిధిలో ప్రారంభం కానున్న దసరామహోత్సవాలకు రావాలని ఇవో సూర్యకుమారి హైదరాబాద్లో రాజభవన్కు వెళ్ళి గవర్నర్ దంపతులకు ఆహ్వాన పత్రిక అందచేశారు. అమ్మవారి చిత్రపటం, ప్రత్యేక ప్రసాదాలు గవర్నర్ దంపతులకు అందచేశారు.








