ఈ నెల 21నుంచి దసరా మహోత్సవాలు
శ్రీశైలం క్షేత్రంలో ఈ నెల 21 నుంచి 30 వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో ఎన్.భరత్‌గుప్తా తెలిపారు. దేవస్థానం పరిపాలనా భవనంలో సిబ్బందితో కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఉత్సవాల్లో భాగంగా భ్రమరాంబాదేవి ఉత్సవ మూర్తిని 21న శైలపుత్రిగా, 22న బ్రహ్మచారిణిగా, 23న చంద్రఘంటగా, 24న కూష్మాండ దుర్గగా, 25న స్కందమాతగా, 26న కాత్యాయనిగా, 27న కాళరాత్రిగా, 28న మహాగౌరిగా, 29న సిద్దిదాయినిగా, 30న భ్రమరాంబదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం ఏర్పాటు చేయనున్నారు. 29న ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. ఈ ఏడాది ఉత్సవాల్లో భక్తులను ఆకట్టుకునే విధంగా రంపచోడవరం, అరకు ప్రాంతాల సంప్రదాయ గిరిజనుల నృత్య ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.








