ఆందోళన పడకండి తప్పకుండా ఆదుకుంటాం
శబరిమలలో అరెస్టైన కృష్ణా జిల్లా వాసుల కుటుంబ సభ్యులు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ లను విడివిడిగా కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఇటీవల శబరిమలై వెళ్లిన తమ వారిని అక్కడి పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ధ్వజస్తంభంపై పాదరసం చల్లారనే ఆరోపణలపై అరెస్టు చేశారని, తీవ్రవాద చర్య అంటగట్టారని, తమవారు అలాంటి తప్పు ఎన్నడూ చేయరని సృష్టం చేశారు. సమగ్ర విచారణ జరిపించి తమవారు విడుదలయ్యేలా చొరవ తీసుకోవాలని వేడుకన్నారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ డీజీపీ, ముఖ్యమంత్రితో మాట్లాడి తప్పకుండా సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. కేరళ ప్రభుత్వతో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు.








