విజయవాడలో కలెక్టర్ల సదస్సు ప్రారంభం
విజయవాడలో నేడు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ రంగాల్లో పురోగతిపై సమీక్షిస్తారు. దీనిలో ప్రధానంగా ఏడు మిషన్లపై చర్చించనున్నారు. నేటి సాయంత్రం ముఖ్యమంత్రి శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహిస్తారు. రేపు సాధికార మిషన్, వృద్ధిరేటు, టాస్క్ఫోర్స్, మౌలిక వసతుల మిషిన్ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొనున్నారు.








