వెండివాకిలి వద్ద ఇనుప నిచ్చెనలు
టీటీడీ తాజాగా మరో వివాదానికి తెరతీసింది. వైఖానస ఆగమ విరుద్ధంగా వెండివాకిలి వద్ద ఇనుప నిచ్చెనలు ఏర్పాటు చేసి, దానిపై భక్తులను వెలుపలకు తరలించే పనులకు శ్రీకారం చుట్టింది. తిరుమల ఆలయం మూడు ప్రాకారాల్లో నిర్మితమైం ది. ఇందులో మహద్వార గోపురం, వెండివాకిలి గోపురం, ఆనంద నిలయం ఉంది. రెండో ప్రవేశ మార్గమైన వెండివాకిలి ప్రాకారాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. స్వామివారిని దర్శించుకునేందుకు, తిరిగి వెలుపలకు వచ్చేందుకు ఇదే మార్గం. కాగా తాజా వివాదాస్పద నిర్ణయంపై టీటీడీ అధికారులు ఎవరూ మాట్లాడటం లేదు. కనీసం ఆలయ జీయర్లు కూడా దీనిపై స్పందించడం లేదు.








