అమరావతి టూ సింగపూర్‌కు డైరెక్ట్ ఫైట్!
రాజధాని వాసులకు శుభవార్త. గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసు త్వరలోనే అందుబాటులోకి రానుంది. సుప్రసిద్ధ సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు అనుబంధ సంస్థ అయిన సిల్క్ ఎయిర్‌లైన్స్‌కు ఈ విమానాన్ని నడిపేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించుకుందని విశ్వసనీయ సమాచారం. రాజధానిలోని 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను స్విస్ చాలెంజ్ విధానంలో అభివృద్ధి పరిచే అవకాశాన్ని పొందిన సింగపూర్ కన్సార్షియం ప్రతినిధులతో ఏపీసీఆర్డీయే ఉన్నతాధికారులు జరిపిన సమావేశాల్లో సింగపూర్ ప్రతినిధులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిసింది.













