మిస్టర్ టీన్ వరల్డ్‌గా విశాఖ బాలుడు
గ్రీస్‌లో గతనెలలో జరిగిన లిటిల్ మిస్ అండ్ మిస్టర్ యునైటెడ్ వరల్డ్ పోటీల్లో విశాఖపట్నానికి చెందిన పల్నాటి ధ్రువ్ సత్తా చాటాడు. మిస్టర్ టీన్‌గా, మిస్టర్ కైండ్నెస్గా ఒకే వేదికపై రెండు టైటీళ్లు గెలుచుకున్నాడు. విజయనగరం జిల్లా కోరుకొండ సైనిక స్కూల్లో చదువుతున్న ధ్రువ్ వయసు 13ఏళ్లు. 25 దేశాల నుంచి 68 బృందాలు ఈ పోటీలకు హాజరయ్యాయి. మనదేశం నుంచి వెళ్లిన ఆరుగురు సభ్యుల బృందంలో ఐదుగురు బాలికలు కాగా అరోవాడు ధ్రువ్. అంతార్జాతీయ వేదికకు టీన్స్ విభాగంలో భారత్ నుంచి హాజరైన మొదటి బాలుడు కూడా ఇతనే కావడం విశేషం.








