కాపులను బీసీల్లో చేర్చడం టీడీపీతోనే సాధ్యం
కాపులను బీసీల్లో చేర్చడం తెలుగుదేశంపార్టీతోనే సాధ్యమని ఆంధ్రప్రదే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సృష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చడమే సీఎం చంద్రబాబు ప్రధాన ఆశయమని అన్నారు. కాపుల సంక్షేమానికి చంద్రబాబు కట్టుబడి ఉన్నారని అన్నారు. స్వలాభం కోసం కొందరు కాపులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కాపులకు మేలు చేసేది తెలుగుదేశం ప్రభుత్వమేనని పేర్కొన్నారు. కాపులకు రాజకీయ రిజర్వేషన్లు వద్దని, విద్య, ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు కావాలని ముఖ్యమంత్రిని కోరతామన్నారు. ఓ రాజకీయ పార్టీ చేతిలో ముద్రగడ కీలుబొమ్మ అని ఎద్దేవా చేశారు.








