సీఎం చంద్రబాబుకు దత్తాత్రేయ ఆహ్వానం
హైదరాబాద్లో అక్టోబరు 1న అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను నిర్వహించబోయే అలయ్బలయ్కి రావాలని చంద్రబాబును కోరారు.








