సెప్టెంబర్ 21 నుంచి దసరా ఉత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్వేశ్వరస్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 21 నుంచి దసరా ఉత్సవాలను నిర్వహిస్తారు. తొలిరోజు స్వర్ణకవచాలాంకృత దుర్గాదేవిగా ప్రారంభమై, బాలాత్రిపురసుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలితాత్రిపురసుందరి, మహాలక్ష్మి, సర్వసతి, దుర్గాదేవి, మహిషాసురమర్థిని, రాజరాజేశ్వరి దర్శనంతో ఉత్సవాలు ముగుస్తాయి. సెప్టెంబర్ 27న మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి రెండు షిప్టుల్లో, మిగతా రోజుల్లో నాలుగు షిప్టుల్లో కుంకుమార్చనలను నిర్వహించనున్నారు.








