మహాలక్ష్మీగా కనకదుర్గమ్మ
విజయవాడలో దేవీ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరోరోజైన నేడు మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అమ్మవారి సన్నిధిలో మంగళవాయిద్యాల హోరు, సాంస్కృతిక కార్యక్రమాల జోరు, కుంకుమార్చన ఛండీయాగాలతో ఆధ్మాత్మికత ఉట్టిపడుతోంది. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.








