నీరు ప్రగతి పురోగతిపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
నీరు ప్రగతి పురోగతి కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ ప్రయత్నంలో చిత్తశుద్ధి ఉంటే ప్రకృతి సహకారం కూడా పుష్కలంగా ఉంటుందని అన్నారు. నీరు అందుబాటు పెంచితే 15శాతం వృద్ధిరేటు సాధించడం సులభమేనని అన్నారు. దేశం మొత్తమ్మీద ఎన్ని పంట కుంటలు నిర్మిస్తారో మన రాష్ట్రంలో అన్ని తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల పంటకుంటలు తవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు నీరు ప్రగతిలో చురుకుగా పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కాన్ఫరెన్స్లో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.








