పై డేటా సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్‌లో రూ.600 కోట్లతో ఏర్పాటు చేసిన పై డేటా సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. వివిధ దేశాలతో పాటు మన దేశంలోని వివిధ నగరాల నుంచి ఈ రంగంలోని సి.ఎక్స్.ఒ లెవల్ ఎగ్జిక్యూటివ్‌లు దాదాపు 300 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1300 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, ఆనందబాబు, పలువురు అధికారులు పాల్గొన్నారు.








