పెళ్లిచూపులు టీమ్‌కు సీఎం కేసీఆర్ అభినందన
జాతీయ ఉత్తమ భాషా చిత్రంగా పెళ్లిచూపులు ఎంపికకావడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. చిత్ర దర్శకుడు, నిర్మాత, నటీనటులు, సాంకేతిక సిబ్బందని ఆయన అభినందించారు. ఉత్తమ మాటల రచయితగా ఎంపికైన తరుణ్ భాస్కర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర పరిశ్రమకు చెందిన తెలంగాణ వ్యక్తులు అత్యంత ప్రతిభ కనబరుస్తూ జాతీయస్థాయి గుర్తింపు పొందడం అందరికీ గర్వకారణమన్నారు. సమగ్ర వినోదాత్మక చిత్రంగా శతమానం భవతి, జనతా గ్యారేజ్‌లోని నృత్యాలకు ఉత్తమ నృత్యదర్శకుడిగా రాజు సుందరం ఎంపికవాడంపై సీఎం హర్షం ప్రకటించారు. ఇదే స్ఫూర్తితో తెలుగు చిత్ర పరిశ్రమ మరిన్ని విజయాలు అందుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.













