ఈ నెల 20న సీఎం చంద్రబాబుకు తిరుమలకు
శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 20న తిరుమలకు రానున్నారు. నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఇక్కడికి వస్తున్నారు. ఆరోజు రాత్రి ముఖ్యమంత్రి కుటుంబసభ్యులతో కలిసి తిరుమలలో బస చేయనున్నారు. 21న ఉదయం శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కానున్నారు.








