Chandrababu: అలా జరగకుండా పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకోవాలి: చంద్రబాబు
రాష్ట్రంలో హింసను ప్రేరేపించటానికి వైసీపీ కుట్రలు పన్నుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని, అలజడి సష్టించేందుకు ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల (Tirumala) లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ (YCP) అడ్డంగా దొరికిపోయింది. రాష్ట్ర ప్రజలంతా ఆ పార్టీని చీదరించుకుంటున్నారు. చేసిన పాపాలను దారిమళ్లించాలనేది వైసీపీ కుట్ర. పెట్టుబడులు సాధించి రాష్ట్రాన్ని అభివద్ధి చేయాలన్నదే మన ప్రధాన అజెండా. అది వైసీపీ నేతలకు నచ్చడం లేదు. అందుకే అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడుతున్నారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతాం. టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించేలా మంత్రులు, నేతలు బాధ్యత తీసుకోవాలి. కార్యకర్తలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వైసీపీ ట్రాప్లో పడొద్దు. అలా జరగకుండా పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకోవాలి. హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై వైసీపీ పుట్టింది. ఆ పార్టీ ట్రాప్లో పడితే వారికీ మనకీ తేడా ఉండదు అని అన్నారు.






