దీక్ష విజయవంతం కావడానికి ఇదే స్ఫూర్తి … చంద్రబాబు
నవనిర్మాణ దీక్ష విజయవంతం కావడానికి సహకరించిన వారందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తి మరో ఐదు రోజులు కొనసాగాలని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పోటాపోటీగా దీక్షలు జరిగాయని అన్నారు. తొలిరోజు 175 నియోజకవర్గాల్లో 2,146 ర్యాలీలు చేపట్టారని అన్నారు. వీటిల్లో 20 వేల మంది ప్రజాప్రతినిధులు, 6.63లక్షల మంది ప్రజలు పాల్గొన్నట్లు తెలిపారు.








