పేదరికం లేని సమాజం కోసం కృషి : చంద్రబాబు
పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. పేదవాడికి అండగా ఉండడమే తన జీవితాశమని తెలిపారు. రాష్ట్రాభివృద్ది కోసం రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకాడేది లేదని సృష్టం చేశారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. నన్ను నమ్ముకున్న ప్రజల కోసమే పనిచేస్తానని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించామన్నారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టామని, ఒక్కొక్క ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు. పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమివ్వడమే లక్ష్యమని తెలిపారు. అంకితభావంతో పనిచేస్తే ఏదైనా సాధ్యమేనన్నారు. పేదవాడికి అండగా ఉండడమే తన జీవితాశయమని అన్నారు.








