8న కాలిఫోర్నియాకు చంద్రబాబు రాక?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్ఐబిసి) అవార్డును అందుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలిఫోర్నియా వెళ్ళనున్నట్లు అనధికారిక సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అమెరికా పర్యటనను విజయవంతం చేయడానికి ఎపిఎన్ఆర్టి కూడా రంగంలోకి దిగింది. ఎపిఎన్ఆర్టి సిఇఓ రవి వేమూరి, చీఫ్ కో ఆర్డినేటర్ బుచ్చిరాం ప్రసాద్ కూడా ఇందుకు సంబంధించి ప్రాథమిక ఏర్పాట్లను చేశారు. మరోవైపు అమెరికాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి కూడా ముఖ్యమంత్రి అమెరికా పర్యటన విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లకోసం సన్నిహితులతో సమావేశమైనట్లు తెలిసింది.













