గ్లోబల్ టూరిజం హబ్‌గా అమరావతి : చంద్రబాబు
ప్రపంచస్థాయి అమరావతి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10 సూత్రాలను అధికారులకు నిర్దేశించారు. వీటిని సమర్థవంతంగా పూర్తిచేసేందుకు అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు అధికారులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని గ్రామ ప్రాంతాలు గ్రీన్ కార్పెట్‌గా తయారుచేయాలని సూచించారు. బ్లూ-గ్రీన్ సిటీగా తయారు చేసేందుకు అధికారులు ప్రణాళికాబద్దంగా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా అమరావతి డవలప్మెంట్ కార్పొరేషన్ రూపొందించిన బ్లూప్రింట్‌ను ఆయన పరిశీలించారు. కొత్త డిజైన్లు పట్ల ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డవలప్మెంట్ మంత్రి నారాయణకు పది సూత్రాల ప్లాన్‌ను వివరించారు. ఈ సూత్రాలను అమలుచేయడం ద్వారా అమరావతిని గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. వీటిలో శాఖమూరు గ్రామంలో గ్రీన్‌పార్కు ఏర్పాటుచేయడం, రోడ్లను సుందరీకరించడం, రాజధాని పరిధిలోని ఏడు రోడ్ల వెంట చెట్లను నాటించడం, ఉండవల్లి గుహలను అభివృద్ధి చేయడం, కొండవీటివాగు పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధిపర్చడం, దక్షిణ భాగ ఒడ్డును పూర్తిస్థాయిలో అభివృద్దిపర్చడం, రామవరప్పాడు నుండి రమేష్ హాస్పటల్ వరకూ ఉన్న జాతీయ రహదారిని అప్‌గ్రేడ్ చేయడం, స్రాప్ పార్కును ఏర్పాటు చేయడం, కనకదుర్గ వారధి దగ్గర గ్రీన్‌పార్కు ఏర్పాటు చేయడం, పవిత్ర సంగమాన్ని సుందరీకరించడం ఉన్నాయి.








