పీవీ సింధును సబ్ కలెక్టర్ గా నియమిస్తాం : చంద్రబాబు
రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధును సబ్ కలెక్టర్ గా నియమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజాసేవల చట్ట సవరణ బిల్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు వీలుగా ఈ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఒలింపిక్స్లో పీవీ సింధు ఎంతో ప్రతిభ చూపిందని కొనియాడారు. ఆమెకు ముందుగా ప్రకటించిన విధంగా గ్రూప్-1 ఉద్యోగంలో భాగంగా సబ్ కలెక్టర్గా నియమిస్తామన్నారు. గత ప్రభుత్వాలు క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేశాయని అన్నారు. తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.








