తిరుమల దర్శనం టికెట్లపై జీఎస్టీ ఎత్తివేతకు అరుణ్ జైట్లీ సుముఖత
తిరుమల దర్శనం టికెట్లపై జీఎస్టీ ఎత్తివేతకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సుముఖత వ్యక్తం చేశాని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఫైబర్ గ్రిడ్‌కు జీఎస్టీ ఎత్తివేతపై కౌన్సిల్లో చర్చిస్తామని జైట్లీ చెప్పారన్నారు. కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్, పోలవరం బకాయిలపై చర్చించినట్లు తెలిపారు. ఈఏపీ ప్రాజెక్టుల ఆమోదంపైనా జైట్లీతో చర్చించామన్నారు.








